Friday, 24 February 2017

Chilagada dumpalu Sweet Potatoes

చాలా  పోషకాలు చిలగడ దుంపలో ఉంటాయి.
విటమిన్‌ ఎ: చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరగానే ‘విటమిన్‌ ఎ’గా మారుతుంది. ఈ విటమిన్‌ లోపంతో బాధ పడేవారు రోజుకో చిలగడ దుంప తింటే ఫలితం ‘విటమిన్‌ ఎ’ లోపంతో తలెత్తే నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
మధుమేహం అదుపులో: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంతో పాటు, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని అదుపు చేసే శక్తి చిలకడ దుంపలకు ఉంటుంది.
క్యాన్సర్‌ నివారిణి: క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు చిలగడ దుంపల్లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆహారం తినడం వల్ల ఉదరం, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పొట్టలో పుండ్లు: ఈ దుంపలోని బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌, పొటాషియం, క్యాల్షియంలు పొట్టలో అల్సర్లను మాన్పుతాయి.
ఆర్థ్రయిటిస్‌: ఈ దుంపలోని మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌ ‘బి కాంప్లెక్స్‌’లు ఆర్థ్రయిటిస్‌ నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించిన నీటితో నొప్పిగా ఉన్న కీళ్ల మీద రుద్దినా ఫలితం ఉంటుంది.



  • చిలకడదుంపల్లో పీచుపదార్థాలు ఎక్కువ ఉన్నాయి.
  • విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ.
  • బెటాకెరొటిన్‌ యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో పుష్కలం.
  • ఐరన్‌, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌-బి, విటమిన్‌-సిలు ఉన్నాయి.
  • రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.
  • క్యాన్సర్‌ రిస్కులో పడకుండా రక్షిస్తుంది.
  • ఇవి తింటే మలబద్థకం తగ్గి, జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
  • వీటిలోని విటమిన్‌-సి, టీటాకెరొటిన్‌ల వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
  • ఈ దుంపలోని ఖొలైన్‌ వైవిధ్యమైన పోషకపదార్థం. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. కండరాల కదలికలు బాగా ఉంటాయి.
  • జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • చిలకడదుంపల్లోని విటమిన్‌-ఎ, టీటాకెరొటిన్‌ల వల్ల చూపు బాగుంటుంది.
  • కడుపులో మంటను తగ్గించే పోషకాలు ఇందులో ఉన్నాయి.
  • బ్లడ్‌ షుగర్‌ను క్రమబద్ధీకరిస్తాయి. ఎనర్జీ పెరుగుతుంది.
  • వీటిల్లోని మెగ్నీషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు.
  • మధుమేహాన్ని క్రమబద్ధీకరిస్తాయి. కడుపులో అల్సర్లను తగ్గిస్తాయి.
  • గుండెజబ్బుల తీవ్రతను తగ్గిస్తాయి.
  • రకరకాల బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
  • బరువు పెరగకుండా సహాయపడతాయి.
  • ఆస్తమా నుంచి సాంత్వననిస్తాయి. బ్రోంఖైటిస్‌ నివారణలో తోడ్పడతాయి.
  • ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గిస్తాయి.
  • వీటిల్లో నీరు బాగా ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ కాకుండా నిలువరిస్తాయి.

చిలగడ దుంపల్లో వివిధ రకాల పోషక పదార్థాలు ఉంటాయి. మిగతా దుంపజాతి కూరగాయల్లానే వీటిలో కూడా పిండి పదార్థాలు పుష్కలం. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయీ పిండి పదార్థాలు. చిలగడదుంపల్లో అధిక మోతాదుల్లో ఉండే పీచుపదార్థం... జీర్ణక్రియకు, రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రణలో ఉంచడానికి, గుండె జబ్బులను దూరంగా ఉంచడానికి, పెద్ద పేగుల క్యాన్సర్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ దుంపల్లో రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంటుంది. కండరాలు, నాడుల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియంతో పాటు పిరిడాక్సిన్‌, బీటాకెరోటిన్‌, విటమిన్‌-సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు కూడా అధికం. సాయంత్రం అల్పాహారంగానూ తీసుకోవచ్చు. సూప్స్‌లో గ్రైండ్‌ చేసి వేసుకోవచ్చు. వీటి చెక్కులో కూడా పోషకాలు ఉంటాయి

Monday, 20 February 2017

Honey

తేనె ఆరోగ్యానికి మంచిది. దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే తేనెలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటి రుచి, వాసన , రంగు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోరకం తేనెలో ఒక్కోరకమైన ఔషధ గుణాలున్నాయి. అంతేకాదు ఇప్పడు తేనెటీగల పెంపకాన్ని అనేక మంది ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు.

రేగి తేనె 
రేగి చెట్ల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరించడం ద్వారా తయారయ్యే తేనెను రేగి తేనె అంటారు. దీనిని శక్తి కోసం, జీర్ణ వ్యవస్థ సక్రమం గా పనిచేయడం కోసం ఉపయోగిస్తున్నారు.
 
యూకలిప్టస్‌ తేనె 
యూకలిఫ్టస్‌ చెట్లలో తేనెతుట్టెలు ఉండేలా చేస్తారు. ఆ చెట్ల నుంచి సేకరించిన మకరందంతో తయారయ్యేదే యూకలిఫ్టస్‌ తేనె. అస్తమా, గుండె సంబంధిత వ్యాధులు, జలుబు వాళ్లు దీనిని తీసుకుంటారు.
 
వాము తేనె 
వాము పండించే ప్రాంతాలలో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. వామ తేనెను అల్సర్సు, గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్నవాళ్లు తీసుకుంటే మంచిది.
 
అడవి పూల తేనె 
అడవిలో సహజంగా లభించే పూల నుంచి తయార య్యేదే అడవి పూల తేనె. దీన్ని అందరూ వాడవచ్చు.
 
కొత్తిమీర తేనె 
పెద్దఎత్తున కొత్తిమీర పండించే ప్రాంతాలలో తేనెతుట్టెల బాక్సులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సేకరించే మకరందాన్ని కొత్తిమీర తేనె అంటున్నారు. ఇది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయో గిస్తారు. థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులున్న వాళ్లకూ చాలా మంచిది.
 
నేరేడు తేనె 
నేరెడు చెట్ల వద్ద ఏర్పాటు చేసిన తుట్టెల నుంచి సేకరించిన తేనెను ఈ పేరుతో పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దీనిని ఉపయోగి స్తారు. దీన్ని తగిన మోతాదులో తీసుకుంటే హుషారుగా ఉంటారు.
 
లిచీ తేనె 

లిచీ పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో దీనిని ఉత్పత్తి చేస్తారు. దీనిని అందరూ వాడుకోవచ్చు.

Sunday, 5 February 2017

Pulichinta leaves


Turmeric




















పసుపు క్రిమిసంహారిణి. 
 పసుపు క్యాన్సర్‌ కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. 
అల్జీమర్స్‌ (మతిమరుపు) తీవ్రతను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
చర్మపు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని సుగుణాలున్న పసుపుతో పానీయం తయారు చేసుకుని ప్రతిరోజూ తాగి ఈ రుగ్మతల నుంచి రక్షణ పొందవచ్చు.
 
కావలసిన పదార్థాలు:
  •  చల్లని నీరు - 4 కప్పులు
  • తాజాగా కోరిన లేదా పొడి చేసిన పసుపు - 2 టేబుల్‌ స్పూన్లు
  •  తేనె - 4 టేబుల్‌ స్పూన్లు
  •  నిమ్మరసం - ఒకటిన్నర టీ స్పూన్లు
తయారీ ఇలా!
  •  పైన చెప్పిన వాటన్నింటినీ మిక్సర్‌లో వేసి
    తిప్పి, తాగేయాలి.

Tamarind and its chutney - Chinta Pandu
















చింతపండు పులుపు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండును ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. చింతపండులో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీని ద్వారా లభించే గుజ్జులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో ఇది సమర్థవంతంగా పోరాడుతుందని చెబుతున్నారు. చింతపండులోని పోషకాలు శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలస్ట్రాల్‌ పెరగడానికి దోహదం చేస్తాయని వారు అంటున్నారు. ఇవే కాకుండా దీనిలో లభించే పొటాషియం, మినరల్స్‌ విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడతాయని వారు స్పష్టం చేస్తున్నారు.



చింతపండు, ఆకు రెండూ ఆరోగ్యకరమే! వీటిలోని పోషకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హెపటైటిస్‌ ఎ, బి, సిల నుంచి రక్షణ కల్పించడంతోపాటు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్‌లకు గురి కాకుండా కాలేయాన్ని కాపాడతాయి.

కాలేయం దాదాపు 500 జీవక్రియలను నిర్వహిస్తుంది. తనను తాను పునర్నిర్మించుకునే సామర్ధ్యం కలిగిన ఏకైక అవయవం కాలేయం! అయితే అస్తవ్యస్త జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వివిధ చికిత్సల్లో భాగంగా వాడే మందుల ప్రభావంతో కాలేయంలో క్రమంగా విషాలు పేరుకుంటూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు విసర్జించేలా చేయాలంటే, ఓ చిట్కా పాటించాలి. గుప్పెడు లేత చింత ఆకులను శుభ్రంగా కడిగి, ఒక లీటరు నీళ్లలో కలిపి 15 నిమిషాలపాటు మరిగించాలి. దీన్లో రుచికి తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం చెరొక కప్పు తాగితే కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

Murmura


Pop Corn

ఆహార పదార్థాల్లో ఔషధ విలువలున్న వాటినే ఎవరైనా ప్రత్యేకంగా చూస్తారు.  అయితే ఆ ప్రత్యేకతలు మనం అతి మామూలుగా తీసుకునే పదార్థాల్లోనే ఉంటాయని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక ఏమవుతుంది? చాలా మందిలో ఇప్పటిదాకా ముడిధాన్యాల్లో పీచు పదార్థం తప్ప పెద్దగా ఏమీ ఉండవనే అభిప్రాయమే ఉంటూ వచ్చింది. కానీ, స్కాన్రేటన్‌ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనల్లో ఈ ధాన్యాల్లో పాలీఫెనాల్స్‌ అనే  యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయనే సత్యం వెలుగు చూసింది. పండ్లల్లో, కూరగాయల్లో మాత్రమే ఉంటాయనుకుంటున్న ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముడిధాన్యాల్లో ప్రత్యేకించి పాప్‌కార్న్‌లో ఉన్నట్టు రుజువయ్యింది, అమెరికన్‌ కెమికల్‌ సొసైటీకీ పరిశోధకులు అందచేసిన ఒక నివేదికలో అందచేశారు. శరీరానికి హాని కలిగించే ఫ్రీ-రాడికల్స్‌ బారిన పడకుండా కాపాడేవి యాంటీ-ఆక్సిడెంట్లే. అయితే అవి కేవలం పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఉంటాయనుకునే వారు. కానీ, ముడిధాన్యాల్లో ప్రత్యేకించి మొక్కజొన్నల్లో చాలా ఎక్కువగా ఉంటాయని తేలింది. ఫైౖబర్‌ ఒక్కటే అని కాకుండా మిగతా ఎన్నో యాంటీ-ఆక్సిడెంట్లు సైతం ఈ ముడిదాన్యాల్లో ఉంటాయని, పోల్చిచూస్తే మిగతా వాటికన్నా పాప్‌కార్న్‌లో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలడం పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. పాప్‌ కార్న్‌ అంటే కేవలం కాలక్షేపం కోసం తినే స్నాక్స్‌గానే వాటిని చూస్తూ ఉండిపోయాం. కానీ, శరీరాన్ని పలు రకాల వ్యాధులకు గురిచేసే  ఫ్రీ-రాడికల్స్‌ను అంతమొందించే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం ఎవరికైనా అమితానందం కలిగించే విషయమే.





పాప్‌కార్న్‌ని టైమ్‌పాస్‌ స్నాక్‌ అయినప్పటికీ దీనిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఆర్గానిక్‌ పాప్‌కార్న్‌ తింటే మరీ మంచిది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. అవేమిటంటే...
  • జీర్ణక్రియలో సహాయపడతాయి. బరువుతగ్గడంలో ఉపయోగపడతాయి.
  • బ్లడ్‌ షుగర్‌, ఇన్సులిన్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
  • ఎనర్జీ పెరుగుతుంది. డయటరీ ఫైబర్‌ కూడా ఇందులో ఉంది.
  • ఫ్యాట్‌ తక్కువ. విటమిన్‌ బి కాంప్లెక్స్‌, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్‌లు బాగా ఉన్నాయి.
  • ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.
  • ఇది పూర్తిగా హెల్దీ స్నాక్‌. గ్లూటెన్‌-ఫ్రీ. మనం తీసుకునే డైట్‌కు హానిచేయదు.
  • ఇవి తింటే ఆకలి తొందరగా వేయదు.
  • ఇన్ఫమ్లేషన్‌ తగ్గిస్తుంది.
  • మలబద్దకం నుంచి సాంత్వననిస్తుంది.
  • పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్‌ ఎక్కువ.
  • గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
  • పీచుపదార్థాలు అధికంగా ఉండడం వల్ల పెద్దపేగు కాన్సర్‌ని నిరోధిస్తుంది.
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బి3, బి6, ఫోల్లేట్‌, పాంథోథెనిక్‌ యాసిడ్లు ఇందులో ఉన్నాయి. ఇవి ఎనర్జీనివ్వడంతో పాటు వివిధరకాల పోషకాలను శరీరంలో క్రమబద్ధీకరిస్తాయి.
.


జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్‌ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్‌కార్న్‌ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్స్‌ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు చెబుతున్నారు. పాప్‌కార్న్‌ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు



Gooseberry and its uses