Herbal Medicines traditionally used in India as per Ayurveda
Thursday, 18 April 2019
Thursday, 7 March 2019
Thursday, 17 January 2019
Saffron
కుంకుమపువ్వు చలి, జలుబుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలను జలుబు చేసినప్పుడు నుదురు మీద రాసుకుంటే, ఉపశమనం లభిస్తుంది. ఈ పువ్వులో శరీరానికి వేడిని అందించే గుణాలుంటాయి.
జ్ఞాపకశక్తి: కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే మెదుడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిలువరిస్తుంది.
మెన్‌స్ట్రువల్ క్రాంప్స్: బహిష్టు సమయంలో పొత్తి కడుపులో నొప్పి తగ్గాలంటే కుంకుమపువ్వు కలిపిన పాలు తాగాలి. దీనిలో నొప్పిని నివారించే గుణాలుంటాయి. దాంతో కొంత ఉపశమనం పొందుతారు.
నిద్రలేమి: కుంకుమ పువ్వులోని క్రొసిన్, సాఫ్రనాల్, పిక్రోక్రోసిన్ వంటి ప్రొటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పాలలో లేదా టీలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య దరిచేరదు. మానసిక ఒత్తిడిని పోగొడుతుంది. కుంకుమపువ్వులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం: రక్త ప్రసరణ సవ్యంగా జరిగేందుకు, రక్తనాళాలు కుచించుకుపోకుండా కుంకుమపువ్వు చూస్తుంది. కుంకుమపువ్వులోని లక్షణాలు రక్తంలో కొలెస్ర్టాల్‌ను తగ్గించి, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ముప్పునునివారిస్తాయి.
ఆస్తమా, అలర్జీ: గ్లాసు పాలలో కుంకుమపువ్వు కలిపుకొని తాగితే కీళ్ల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆస్తమా, ఇతర అలర్జీల సమస్యలను దూరంచేస్తాయి.
Friday, 21 September 2018
Tuesday, 4 September 2018
Lady Fingers improves mathematical skills / Okra water
బెండకాయలో పీచు అధికంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి డైట్ అంటున్నారు
- బెండలో పీచు అధికంగా ఉంటుంది. బెండకాయ తినడం వల్ల శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.
- వీటిలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు కారణమయ్యే హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం నిల్వలను తగ్గిస్తుంది.
- వీటిలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
- బెండలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
- శరీరంలో కార్బోహైడ్రేట్లను ముక్కలు చేసే ఎంజైమ్‌లను బెండకాయ నియంత్రిస్తుంది. క్లోమంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
Subscribe to:
Posts (Atom)