Sunday 20 May 2018

Keep Cool in Summer

 వేసవిలో వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి  కొన్ని సూచనలు :-
  • ఎండాకాలం ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం మంచిది. తాజా పళ్లు, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నిమ్మరసానికి బదులుగా కొబ్బరినీళ్లు, పుచ్చకాయల జ్యూస్‌, కీరాజ్యూస్‌ తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తాయి.
  • సమ్మర్‌లో ఉదయం అల్పాహారం తక్కువగా తీసుకుంటారు కాబట్టి లంచ్‌ మాత్రం హెవీగానే ఉండాలి. పెరుగుకు బదులు మజ్జిగ బెటర్‌ ఛాయిస్‌ అవుతుంది. ఆహారపదార్థాల్లో మసాలాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ద్రవాహారాలు హాయిగా ఉంటాయి.
  • చల్లటి ఫ్రిజ్‌ వాటర్‌ను దూరం పెట్టాలి. కూల్‌డ్రింక్స్‌ కూడా మంచిది కాదు. అవి జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. చక్కెర, ఐస్‌క్రీమ్‌లు వేసవిలో ఇబ్బంది కలిగిస్తాయి. చల్లటి పండ్లు తింటే ఏమీ కాదు.
  • ఆవాలు, అల్లం, మిరపకాయలు, కారంతో పాటు టోమాటో, వెల్లుల్లి, మిరియాలను కూడా దూరం పెట్టాలి.
  • కూలింగ్‌ హెర్బ్స్‌గా చెప్పుకునే పుదీనా, మెంతికూర, కరివేపాకు, సోంపులను వంటల్లో ఎంత ఉపయోగిస్తే అంత మంచిది. వీటితో పాటు కావాలంటే జీలకర్ర, దాల్చినచెక్క, పచ్చ యాలకులను వాడొచ్చు. బ్రకోలీ, పొట్లకాయ, ములక్కాయలు, కీర, తెల్ల గుమ్మడికాయలు శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తాయి.
  • పాలు, కొబ్బరి, వెన్న, నెయ్యి... ఏవైనా సరే కొద్ది పరిమాణంలో వాడితే మంచిది. అయితే వీటిని తప్పకుండా వేడి చేయాలి. వేపుళ్లను దూరం పెడితే జీర్ణక్రియ సరిగ్గా జరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయలు, మామిడి పండ్లు, చెరుకు, పనసపండ్లను రోజంతా అప్పుడప్పుడు తింటూ ఉండాలి.

Wednesday 16 May 2018

grapes

నల్ల  ద్రాక్షలు వేసవి తాపానికి చల్లదనాన్ని సమకూరుస్తాయి.  ద్రాక్షలో ఖనిజలవణాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలుగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అజీర్తి, కంటి సమస్యలు, మరెన్నో జబ్బుల నివారణకు ద్రాక్ష పెట్టింది పేరు. ద్రాక్ష చక్కటి రుచితోపాటు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ద్రాక్షను వాడాలని పోషకాహర నిపుణులు తెలుపుతున్నారు. ద్రాక్షలో సీ-విటమిన్‌, సీ- విటమిన్‌తోపాటు విటమిన్‌-ఏ, బీ6, ఫోలిక్‌ ఆమ్లంకూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫా స్పరస్‌, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షలో స మృద్ధిగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ద్రాక్షలో ప్లేవ్‌నాయిడ్స్‌లాంటి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ టంవల్ల వయస్సు మీద పడటం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్షలో టీరోస్టిల్‌బీన్‌ అనే పదార్థం గుండెకు రక్షణ ఇస్తాయి.
ద్రాక్ష తొక్కలో సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుకున్ని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాక ద్రాక్ష రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి, నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దో హదపడుతాయి.
మలబద్దకం, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి, ద్రాక్షలు యూరిక్‌ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం తగ్గి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతీరోజు ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్‌ డీజనరేషన్‌ అవకాశం 36శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తీసుకుంటే మై గ్రేవ్‌నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్షలో రెయిసిన్స్‌ ఉండి మలబద్దకం, ఆసిడోసిన్‌, రక్తహీనత జ్వరాలు, లైంగిక సమస్యలను త గ్గించడంతోపాటు కంటి పరిరక్షణలో ద్రాక్ష రక్షణగా కాపాడుతుంది..

Monday 14 May 2018

Mango leaves






















  • మామిడి టెంకలోని జీడిని ఎండబెట్టి, ఆ తర్వాత చూర్ణం చేసి, 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు తేనెతో సేవిస్తే, ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. ఇతరమైన పలు దగ్గు సమస్యలు హరిస్తాయి.
  • జీడి చూర్ణాన్ని 2 గ్రాముల పంచదారతో రోజూ రెండు సార్లు సేవిస్తే, తెల్లబట్ట (లుకోరియా)తో పాటు, కడుపులోని మంట తగ్గుతాయి.
  • జీడి పొడిని జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గిపోతుంది.
  •  లేత మామిడి చిగుళ్లు నూరి, 5 నుంచి 15 గ్రాముల ముద్దను పెరుగులో కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే అతిసార సమస్య ఆగిపోతుంది.
  • రెండు చెంచాల మామిడి పట్ట రసాన్ని గానీ, ఒక చెంచా మామిడి పట్టా పొడిని గానీ సేవిస్తే, వాంతి ద్వారా లేదా, మల విసర్జన ద్వారా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.,
  • మామిడి ఆకుల కషాయంతో పుక్కిలి పడితే, దంత చిగుళ్ల వాపు, నోటి పూత తగ్గుతాయి.

Saturday 12 May 2018

Ravi chettu

  • రావి చెక్కను నీటితో ఉడికించి తయారు చేసిన చిక్కని క షాయాన్ని 50 మి.లీ చొప్పున రోజుకు రెండు సార్లు సేవిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • రావి పండ్లను ఎండబెట్టి పొడిచేసి, ఒక చెంచా పొడిని తేనెతో లేదా వేడినీళ్లతో ఇస్తే, ఉబ్బస రోగం ఉపశమిస్తుంది.
  • రావి చెట్టు బెరడును కాల్చి చేసిన బూడిదను నీటిలో కలిపి వడగట్టి, 30 మీ. చొప్పున అవసరాన్ని బట్టి సేవిస్తే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి. ఇదే ద్రావణంలో పాలు, పంచదార కలిపి సేవిస్తే స్త్రీలల్లోని పలురకాల గర్భాశ య దోషాలు తొలగిపోతాయి.
  • లేత రావి ఆకులను నూరి కరక్కాయ పరిమాణంలో సేవిస్తే, రక్త విరేచచనాలు తగ్గుతాయి.

Sunday 6 May 2018

puttagodugulu

పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
 ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు.
 ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.
 బి1, బి2, బి3, బి5, బి9లు వీటిల్లో ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
 ఎలర్జీలు, ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి.
 ఇవి సహజసిదఽ్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి.
 పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది.
 పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్‌-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు, ఎగ్జిమా వంటి సమస్యలను తగ్గిస్తాయి.
 యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి.
 వీటిల్లో ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ.
 వీటిల్లోని పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్‌ ప్రమాణాన్ని తగ్గిస్తాయి.
 ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి.
 రొమ్ము, ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.
 మధుమేహవ్యాధిగ్రస్థులకు లైట్‌ డైట్‌ ఇవి.
 పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్‌ తలెత్తదు.
 రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి.
 పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
 పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది.
 ఐరన్‌ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి.
 శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి.
 గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

Tuesday 1 May 2018

Sapota

సపోటాతో... ఎన్నో పోషకాలు

వేసవిలో లభ్యమయ్యే వాటిలో సపోటాలు ఒకటి. వేసవిలో ఉష్ణోగ్రతల ధాటికి సాధారణంగానే శరీరాన్ని నిస్సత్తువ ఆవహించడం జరుగుతుంది. ఉన్నట్టుండి బలహీనంగా అనిపిస్తుంది. దీనినుంచి బయట పడాలంటే రెండు మూడు సపోటా పండ్లు తింటే సరిపోతుందని, నిమిషాల్లో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుందట. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోజ్‌ వల్ల ఇలా జరుగుతుంది.

ఉగాది నుంచి మే నెలాఖరు వరకూ లభించే సపోటాలను గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రాజమహేంద్రవరం దగ్గరలోని చక్రద్వారబంధం, రాధేయపాలెం, బూరుగపూడి తదితర ప్రాంతాల్లో సపోటా తోటలు ఉన్నాయి. పాల సపోటా, గేదె సపోటా, కళాపతి రకాలు పండిస్తారు. గేదె సపోటా, కళాపతి విశాఖ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. పాల సపోటా మాత్రం స్థానికంగా విక్రయిస్తారు.
సపోటాలో ఏముంటాయి..
శరీరానికి తప్పనిసరిగా అవసరమైన ఐసోలూసిన్‌, మితియోనిన్‌, ఫినైల్‌ ఆలమిన్‌, థియోనిన్‌, ట్రిప్టోఫాన్‌, వాలిన్‌, లూసిన్‌ వంటి అమినో ఆమ్లాలు, విటమిన్‌ ఏ, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, పాంథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి6, ఫోలిక్‌ ఆమ్లం, సైనకోబాలమిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు, కాల్సియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, సెలీనియం వంటి ఖనిజ లవణాలతోపాటుగా శక్తి, మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, పీచు పదార్థం, సాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి.
శరీరానికి చేసే మేలు..
గుజ్జులో అధికంగా ఉండే పీచు పదార్థం, పైపొట్టులో ఉండే కేరోటిన్లు మలవిజర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. విటమిన్‌ ‘ఏ’ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ ‘సీ’ శరీరంలోని హానికరమైన ప్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్‌, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి, క్యాల్షియం, థయామిన్‌, ఫ్రక్టోస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పండ్లలో పాలిఫినోలిక్‌ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ పారాసిటిక్‌ సుగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి హానిచేసే సూక్ష్మక్రిములను ప్రవేశించకుండా అడ్డుపడతాయి. తాజా పండ్లలో జీవ క్రియలను మెరుగుపరచే పొటాషియం, రాగి, ఇనుము, ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయిక్‌ ఆమ్లాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటాలు తినిపిస్తే మంచిదంటారు. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు మితంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి. దీనిలో ఉండే ఏ, సీ విటమిన్లు చర్మానికి కొత్త నిగారింపును తీసుకువస్తాయి. జ్యూస్‌ కంటే పండుగా తింటేనే మేలు ఎక్కువట.
రుచిగా ఉన్నాయి కదాని అదే పనిగా తినడం సరికాదు. అలా చేస్తే అజీర్ణంతో కడుపు ఉబ్బరం చేసే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒక పండుకు మించి తీసుకోకూడదంట. ఒబేసిటీ, మధుమేహం ఉన్నవారు వైద్యుడి సలహా మేరకే తినాలి. సపోటాల్లో బరువు పెంచే గుణం ఉంది. పచ్చివి తింటే దానిలో ఉండే సపోనిన్‌ అనే పదార్థంవల్ల నోరు ఆర్చుకుపోయి, గొంతు, నాలిక వగరుగా అవుతాయి.
సపోటాతో పలు చిట్కాలు..
సపోటా గింజలను ముద్దలా నూరి, కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. చుండ్రు సమస్య కూడా నెమ్మదిస్తుంది. సపోటా పళ్లు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గుతుందని, రతి సామర్ధ్యం పెరుగుతుందని చెబుతారు.


 సపోటా  పండుగా తిన్నా జ్యూస్‌గా తీసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది. 100 గ్రాముల సపోటా రసంలో నీరు 73.7శాతం, పొటాషియం 269 మి.గ్రా, కొవ్వు 1.1 గ్రాము, ఫాస్ఫరస్‌ 17మిగ్రా, కరోటిన్‌ 97 మైక్రోగ్రాములు, క్యాల్షియం 28 మిగ్రా, ఐరన్‌ 2 మిగ్రా, మ్యాగ్నీషియం 26మిగ్రా, సి-విటమిన్‌ 6 మిగ్రా, సోడియం 5.9 మిగ్రాముల మేరకు ఉంటాయి. సపోటా శాస్త్రీయ నామం లిక్రస్‌ సపోటా. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాల మీదుగా 18వ శతాబ్దంలో సపోటా భారతదేశానికి చేరుకుందని చరిత్రకారులు చెబుతారు. సపోటా జ్యూస్‌ను ప్రతిరోజూ నిర్ణీత ప్రమాణంలో తీసుకుంటే రక్తహీనత బాగా తగ్గుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. అతిసార వ్యాధిని నియంత్రించే గొప్ప గుణం సపోటాలో ఉంది. నరాల బలహీనతతో బాధపడేవారు సపోటా రసాన్ని తీసుకుంటే మంచిది. సపోటా రసాన్ని పాలతో కలుపకుని తాగితే శరీరానికి శక్తి లభిస్తుందని ఈ రసానికి పురుషవీర్యణాలను పెంచేశక్తి కూడా ఉందని వైద్యులు అంటున్నారు. శరీరానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి. నిత్యం ఒక సపోటాను తింటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ప్రత్యేకించి రక్తహీనత, నరాల బలహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.