Monday, 30 April 2018

Jaajikaya


జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా వేస్తే, ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి, పై పూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
జాజికాయలో ఫంగ్‌సను నిరోధించే గుణం ఉంది. అందువల్ల జాజికాయను నీటితోనూరి పూస్తే తామర వంటి వ్యాధులు తగ్గిపోతాయి.
నీటిలో గంటల పర్యంతం నానడం వల్ల కాలివేళ్ల మధ్య చర్మం దెబ్బతిన్న వారు, జాజికాయను నూరి వేళ్ల సందుల్లో పెడితే చాలా తొందరగా చర్మం చక్కబడుతుంది.
జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే శీఘ్ర స్కలన సమస్య తొలగిపోతుంది
కడుపు నొప్పి వచ్చి, విరే చనాలు అవుతూ ఉంటే, కాస్తంత జాజికాయ పొడి, కొంచెం అల్లం రసం, బెల్లం, నెయ్యి కలిపి సేవిస్తే చాలు. నొప్పి, విరేచనాలు వెంటనే తగ్గుతాయి.

Sunday, 29 April 2018

seema chinta kayalu

 సీమచింతకాయలు లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి:-
  • బరువును అదుపుచేస్తాయి.
  • పోషకనిధులు, ఔషధ గుణాలు మెండు. అందుకే వీటిని మందుల తయారీల్లో వాడతారు.
  •  వీటి చెట్టు బెరడు, ఆకులు, కాయలు, గింజలు ఆరోగ్య సమస్యలకు సంజీవినిలా పనిచేస్తాయి. పంటినొప్పులు, చిగుళ్లల్లో రక్తంకారడం, కడుపులో అల్సర్లను నివారిస్తాయి. ఆకుల నుంచి తీసిన పదార్థాలు గాల్‌ బ్లాడర్‌ సమస్యలను నిరోధిస్తాయి.
  •  శరీరంపై రక్తస్రావాన్ని అరికడతాయి. గాయాలను మాన్పుతాయి.
  • రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
  • క్యాన్సర్లను అరికట్టే సుగుణాలు వీటిల్లో ఉన్నాయి.
  • మధుమేహవ్యాధిగ్రస్థులకు ఇవెంతో మంచివి.
  •  బ్లడ్‌షుగర్‌, కొలెస్ట్రాల్‌లను ఇవి నియంత్రణలో ఉంచుతాయి.
  • వీటిల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే ప్రతిరోజూ పావుకప్పు సీమచింతకాయల్ని ఆహారంలో చేరిస్తే మంచిది.
  • గర్బిణీలకు ఎనర్జీని అందిస్తాయి.
  • క్యాల్షియం కూడా అధికంగా ఉన్న వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
  •  శరీరంలో వణుకు, నరాల అస్వస్థతను తగ్గిస్తాయి.
  •  వీటిని తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.
  •  లైంగికపరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు.
  •  విరేచనాల నివారణకు సీమచింతకాయల ఆకుల్ని ఉపయోగిస్తారు.
  •  ఈ చెట్టు బెరడు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుజ్జు దీర్ఘకాలిక డయేరియా, డిసెంటరీ, టిబి వంటి వాటికి వాడతారు.
  •  గాయాలకు ఇవి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తాయి.
  •  చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
  •  వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి.
  •  రకరకాల జ్వరాలను నిరోధిస్తాయి. మలేరియా, జాండి్‌సలను తగ్గిస్తాయి.
  • రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
  • నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా సహకరిస్తాయి.
  • నోటి అల్సర్లను తగ్గిస్తాయి.
  • మొటిమలు, యాక్నే రాకుండా నివారిస్తాయి. నల్లమచ్చలు పోగొడతాయి.
  • వీటిని ఆహారంలో చేర్చితే నిత్యయవ్వనుల్లా కనిపిస్తారు.

Wednesday, 11 April 2018

Jaji flowers

జాజి ఆకులను నమిలి మింగినా, ఓ 20 జాజి ఆకులతో తయారు చేసిన క షాయంతో పుక్కిలించినా, నోటి అల్సర్లు తగ్గుతాయి.
 జాజి ఆకుల రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి, సన్నటి మంటపైన రసం ఇగిరే దాకా కాచి తయారు చేసిన తైలాన్ని చెవిలో వేస్తే, చీము కారడం తగ్గిపోతుంది.
 ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతిరోజూ పట్టిస్తూ ఉంటే, పగుళ్లు మాని, పాదాలు మృదువుగా తయారవుతాయి.
 ఐదారు లేత జాజి మొగ్గలకు, కొద్దిగా చక్కెర కలిపి నూరి, కళ్లకు కాటుకలా వాడితే కొద్ది రోజుల్లోనే కంటి శుక్లాలు తగ్గుతాయి.
 చీముపట్టి దీర్ఘకాలికంగా బాధిస్తున్న మొండి వ్రణాలను, జాజి ఆకుల కషాయంతో కడిగితే, తొందరగా మానిపోతాయి.

Sabja Seeds














  • సబ్జా గింజల్లో ఎన్నో ఔషద గుణా లున్నా యి. సబ్జాగింజ లు శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. మాం సాహారం తిన్నవారికి శరీర తా పం అధికంగా ఉంటుంది. అలాం టప్పుడే సబ్జాగింజలు నీళ్లలో గాని, కొబ్బరి నీళ్లలో గాని నానబెట్టి తాగి తే సత్వర ఉపశమనం కలుగుతుం ది. హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉం టుంది.
  • అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసు నీళ్లలో సబ్జాగింజల గు జ్జు వేసి రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వీటి గుజ్జును పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్షారసాల్లో కలిపి పిల్లలకు తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
  • మనిషి శరీర బరువును కూడా సబ్జాగింజలు తగ్గిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సబ్జాగింజలతో నానబెట్టిన నీటిని నిద్రపోయేముందు తాగితే చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఈ నీరు యాంటి బయాటిక్‌గా పనిచేస్తుంది.
  • శరీరంలో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరుసటి రోజుకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలోని కేలరీలను కరిగించడంలో వీటి పాత్ర అధికం. సబ్జాగింజలు నీటిలో వేసిన తర్వాత ఉబ్బి జల్స్‌గా తయారయ్యే దాకా నానబెట్టాలి. ఈ జెల్స్‌ నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియ మెరుగపడటమే కాకుండా శరీర పనితీరుకు ఉపకరించే ప్యాటీఆమ్లాలతో పాటు అధికంగా పీచుని సబ్జాగింజలు కలిగి వుంటాయి.
  • మహిళలకు అవసరమైన ఫోలెట్‌, ఇయాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే ఈ విటమిన్‌ లభించడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల్ని తొలగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • సబ్జాగింజలు తీసుకుంటే వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. గొరువెచ్చటి నీళ్లలో సబ్జాగింజలను నానబెట్టి అందులో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

Saturday, 7 April 2018

Gaddi Chemanthi

  •  తెగిన గాయాలు, అల్సర్లు, ఎగ్జిమా, పలురకాల చర్మవ్యాధులకు గడ్డి చేమంతి ఆకుల రసాన్ని పూస్తే మానిపోతాయి. గాయాల్లోంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపి, గాయం అతుక్కుపోయేలా చేసే శక్తి ఈ చేమంతికి ఉంది. దీని వేరును నీడన ఎండబెట్టి పొడి చేసి, ఒక స్పూను మోతాదులో తీసుకుంటూ ఉన్నా, చర్మవ్యాధులు నయమవుతాయి.
  •  ఆకులను ముద్దగా నూరి రసం మింగుతూ ఉంటే శరీరంలో ఏర్పడిన వాపులతో పాటు ఆయాసం, దగ్గు తగ్గిపోతాయి.
  •  రెండు భాగాలు ఆకు రసం, ఒక భాగం నువ్వుల నూనె కలిపి, తైలం మాత్రమే మిగిలే దాకా కాచి, ఆ తైలాన్ని తల మాడుకు పట్టించి, మూడు గంటల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమూలంగా తొలగిపోతుంది.
  •  గడ్డి చేమంతి ఆకులను ముద్దగా నూరి, వస్త్రంలో ఉంచి పిండి, ఆ రసాన్ని పూస్తూ ఉంటే తామర పూర్తిగా తగ్గిపోతుంది.
  •  ప్రతి రోజూ ఉదయం పరగడుపున 10 పచ్చి ఆకులను నమిలి తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  •  ఆకులను మెత్తగా నూరి పట్టిస్తే, చీము గడ్డలు నయం కావడంతో పాటు, ఇతర కురుపులు కూడా మానిపోతాయి.
  •  పచ్చి ఆకు రసాన్ని రుద్దుతూ ఉంటే, కొద్ది రోజుల్లో పేనుకొరుకుడు తగ్గి, మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.

Aswagandha Plant





















అశ్వగంధ వేరు చూర్ణంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటంటే...
 
ఒత్తిడి, ఆందోళన దూరం: ఈ చూర్ణం పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి తగ్గి చక్కటి నిద్ర పడుతుంది. అంతేకాదు. ఒత్తిడి, ఆందోళనల ప్రభావం మూలంగా తలెత్తే ఆరోగ్య ఇబ్బందులను అధిగమించే శక్తిని సమకూరుస్తుంది. 
బరువు తగ్గిస్తుంది: ఇతర బరువు తగ్గించే మందులతో కలిపి ఈ చూర్ణాన్ని వాడితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్‌ మూలంగా హెచ్చుతగ్గులకు గురయ్యే మెటబాలిజంను సరిచేసే శక్తి ఈ చూర్ణానికి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గే వేగం పెరుగుతుంది.
మధుమేహం అదుపు: నోటి మాత్రలకంటే ప్రభావవంతంగా ఈ చూర్ణం రక్తంలోని గ్లూకోజ్‌ లెవెల్స్‌ను తగిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ లెవెల్స్‌ను సమం చేసి ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచుతుంది. 
కేన్సర్‌ నుంచి రక్షణ: పెద్దపేగు, రొమ్ములు, ఊపిరితిత్తుల కేన్సర్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.
బొల్లి: అశ్వగంధ చూర్ణానికి బొల్లి మచ్చలు చక్కగా స్పందిస్తాయి. కెరటోసిస్‌ అనే చర్మ చికిత్సకు అశ్వగంధ చూర్ణంతో తయారుచేసిన పేస్ట్‌ వాడతారు. అశ్వగంధ అద్భుతమైన స్కిన్‌ టోనర్‌గా కూడా పని చేస్తుంది.