Monday 20 November 2017

battayi

పండులో ఫ్లావనాయిఢ్స్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ బి- కాంప్లెక్స్‌, విటమిన్‌- సి సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటు నివారణకు ఈ పండు మంచిది. గుండెకు బలాన్ని ఇస్తుంది. బత్తాయి రసంలో తేనె కలిపి పడుకునే ముందు తీసుకుంటే సుఖవిరేచనం అవుతుంది. బత్తాయి రసాన్ని రోజూ తీసుకుంటే మచ్చల్ని మాయం చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. లాలాజలాన్ని అధికంగా ఉత్పత్తి చేసేలా గ్రంధుల్ని ప్రేరేపించే గుణాలు బత్తాయిలో ఉన్నాయి. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాలను బయటికి వెళ్లిపోయేలా చేస్తాయి.
 
బత్తాయి రసం ఊపిరి తిత్తులను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్లకు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కామెర్ల వ్యాధినుంచి కోలుకున్న వారిలో ఉండే బలహీన తను నీరసాన్ని పోగొట్టడంలో బత్తాయి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ బత్తాయి రసాన్ని తీసుకుంటే, ర క్త ప్రసరణ చక్కబడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
ఉదయం వేళ యోగా, వాకింగ్‌, జాగింగ్‌ చేసిన తర్వాత ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే, అలసిన శరీరం వెంటనే శక్తివంతమవుతుంది. ఎసిడిటీకి కారణమయ్యే బుడగలను నివారించడం లో బత్తాయి రసం ఉపకరిస్తుంది. రుమాటిక్‌ తరహా వాపు సంబంధిత రుగ్మతలనుంచి బత్తాయి ఉపశమనం కలిగిస్తుంది.

Friday 10 November 2017

capsicum

బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కు గా లభిస్తుంది. రకరకాల రంగుల్లో సైతం లభ్యమవుతుంది. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకు పచ్చవే. ఒక రోజుకు కావాల్సిన సి విటమిన్‌ ఒక్క క్యాప్సికంలోనే దొరుకుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం... క్యాప్సికంలో విటమిన్‌ సి, బి, ఇ, ఫోలిక్‌ యాసిడ్‌, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంన్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్‌, బీటా కెరోటిన్‌, ఎంజైమ్స్‌ శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్‌ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాప్సికం తీసుకోవడం మూలంగా జుట్టు ఊడి పోవడం తగ్గుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారినిగా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలున్న క్యాప్సికాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనకు అందబాటులో దొరికే క్యాప్సికం వాడేందుకు ఎందుకింక ఆలస్యం.. రోజు వారి కూరగాయల్లో ఒక రోజు క్యాప్సికాన్ని కూడా చేర్చుకుందాం.

Thursday 9 November 2017

Almonds

బాదంపప్పు అనగానే..ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటాం. అయితే ఆల్‌మండ్‌లో ఉండే ఫ్యాట్‌ శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అడపాదడపా బాదాంపప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. బాదంతో కలిగే లాభాలు..
బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ సెల్స్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ కారక కణాలను నిలువరిస్తాయి.
బాదంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్‌-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.         బీపీని అదుపులో ఉంచుతుంది.
శరీర బరువు తగ్గించడంలోనూ  క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం                       అవుతుంది.
బాదంలో సమృద్ధిగా ఉండే కాపర్‌, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.
        రోజూ కొన్ని పప్పుల్ని తినడం వల్ల ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.

Wednesday 1 November 2017

aakrotlu (wall nuts)

రోజుకో గుప్పెడు అక్రోట్లు(వాల్‌నట్స్‌) తీసుకుంటే వ్యాధులు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఎయిమ్స్‌ మాజీ చీఫ్‌ డైటీషియన్‌ డాక్టర్‌ రేఖాశర్మ మాట్లాడుతూ పోషకాహార లోపం, శారీరక వ్యాయామం చేయకపోవడంతో భారత్‌లో అనేక మంది కేన్సర్‌, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. పోషకాహారంతోపాటు అక్రోట్లు ఎక్కువగా తీసుకుంటే అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చని న్యూయార్క్‌ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన అభా చౌహాన్‌ చెప్పారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండే ఏకైక ‘గింజ’ అక్రోట్‌’ అని డాక్టర్‌ హెచ్‌కే చోప్రా తెలిపారు.