Saturday, 21 July 2018

ముల్లంగి

  • ముల్లంగి జ్యూస్‌ తరుచూ సేవిస్తూ ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు నయమవుతాయి.
  • ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని తేనెతో కలిపి రోజుకు ఒక చెంచా చొప్పున తీసుకుంటే, శరీరంలోని ఏ అవవయం లోనైనా వాపూ, నొప్పి ఉంటే తగ్గిపోతాయి.
  • పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తరుచూ తాగుతూ ఉంటే, సాఫీగా విరేచనమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొన్ని రకాల లివర్‌ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
  •  ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని అన్నంలో రోజూ కలిపేసుకుని తింటూ ఉంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధులు నయమవుతాయి.
  • ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కాస్తంత ముల్లంగి రసం తాగితే వెంటనే తగ్గిపోతాయి.
  • విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి తోడ్పడుతుంది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటూ ఉంటే అసలు ఆ రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు.
  • ముల్లంగి రసానికి నాలుగో వంతు నువ్వుల నూనె కలిపి, నూనె మాత్రమే మిగిలేలా కాచి భద్ర పరుచుకోవాలి. ఈ నూనెను వడబోసి, చెవిపోటు, చెవిలో హోరు బాధితుల చెవిలో కొన్ని చుక్కలు వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్లవాపులు, నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తే ఆ సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.

No comments:

Post a Comment