Saturday, 24 June 2017

Gummadi /Pumpkin and its seeds



























  • గుమ్మడి గింజల్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
  • గుమ్మడి గుజ్జులోని బీటా కెరొటిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఇందులోని ప్రొటీన్లు జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తాయి.
  • విటమిన్‌-కె ఇందులో బాగా ఉంది. ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.
  • పోషకవిలువలు కూడా అధికంగా ఉన్నాయి. పైగా కెలొరీలు తక్కువ.
  • దోసగింజలు, వాటి ఆకులు, జ్యూసుల్లో పోషకాలు బాగా ఉంటాయి.
  • గుమ్మడిలోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  • ఇందులోని యాంటాక్సిడెంట్లు కంటిచూపు తగ్గకుండా కాపాడతాయి.
  • బేకింగ్‌ రెసిపీల్లో వెన్న, నెయ్యికి బదులు గుమ్మడి ప్యూరీని వాడితే ఆరోగ్యానికి మంచిది.
  • గుమ్మడిలోని బీటా కెరొటిన్‌ కొన్ని క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది.
  •  ఇందులోని విటమిన్‌-సి వల్ల గుండెజబ్బులు, ఆస్తమా సమస్యలు ఉండవు.
  •  చర్మం సాగకుండా, శరీరం శుష్కించకుండా కాపాడుతుంది.
  • గుమ్మడిలాంటి మొక్కల నుంచి వచ్చే ఉత్పత్తులను తింటే బరువు పెరగరు.
  • ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.
  • దీని వినియోగం వల్ల చర్మం చాయ పెరగడంతోపాటు శిరోజాలూ పెరుగుతాయి. ఎనర్జీ పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉంటుంది.
  • పీచుపదార్థాలు కూడా ఇందులో ఎక్కువ.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • మెనోపాజ్‌లో అడుగుపెట్టిన మహిళల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంతో మంచిది.
  • యాంటి-ఇన్‌ఫ్లెమేటరీ ప్రయోజనాలు కూడా పొందుతాము.
  • మంచి నిద్ర పడుతుంది.
  • గుమ్మడికాయ వినియోగం వల్ల బ్లాడర్‌ స్టోన్స్‌ రిస్కు తగ్గుతుంది.



గుమ్మడి కాయలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అనేకం. మిగతా పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా-కెరోటిన్‌ చాలా ఎక్కువ. అంతగా చె ప్పుకునే క్యారెట్‌లో కన్నా ఇది గుమ్మడిలోనే ఎక్కువ. బీటా కెరోటిన్‌ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా కూడా జీర్ణమయ్యే పదార్థం కూడా. దీన్ని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు ఇస్తే హాయిగా తినేసి ఆరోగ్యంగా ఉంటారు. దీని విశేషాల గురించి తెలిసి, కొంతకాలంగా విదేశీయులు కూడా భోజనంలో వాడేస్తున్నారు. ప్రత్యేకించి సూప్స్‌లో దీని వాడకం బాగా ఎక్కువయ్యింది. కూరగానో, సాంబార్‌గానో వాడే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ.
చర్మానికీ, శిరోజాలకూ ఇవెంతో ఉపకరిస్తాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఇట్టే తొలగిపోతుంది., విటమిన్‌-సి కూడా ఎక్కువగా ఉండే గుమ్మడి వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా విశేషమైనవే. వీటిలో సమ్దద్ధిగా ఉండే జింకు, ప్రోస్టేట్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా స్త్రీ పురుషులు ఇరువురిలోనూ లైంగిక వ్యవస్థను ఆరోగ్యపరుస్తుంది. వీటితో పాటు రప్రొటీన్‌, పొటాపియం, మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఎస్నెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉండడం వల్ల గుమ్మడినొక సమస్త పోషకాల నిధిగా న్యూట్రిషియన్లు చెబుతుంటారు ఇవేమీ తెలియక చాలా మంది పందిరి మీద అవి ఓ భారమన్నట్లు తెంపి పారేస్తుంటారు. కానీ, ఒకసారి ఈ విశేషాలన్నీ తెలిస్తే, అమృతంలా ఆస్వాదిస్తారు.




గుమ్మడిలోని ఆరోగ్య సుగుణాలివి...
  • గుమ్మడికాయలో కెరొటనాయిడ్స్‌, పీచుపదార్థాలు, పొటాషియం, విటమిన్‌-సిలతో పాటు జింక్‌, ఐరన్‌, కాల్షియం, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు ఉన్నాయి.
  • చలికాలంలో జింకు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • పోషక విలువలు కూడా వీటిల్లో పుష్కలం. విటమిన్‌-ఎ అధికం.
  •  క్యాలరీలు తక్కువ.
  •  వీటిల్లోని యాంటి ఆక్సిడెంట్ల వల్ల క్రానిక్‌ జబ్బుల రిస్కు తక్కువ.
  • ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి.
  • గుమ్మడికాయలో విటమిన్‌-సి ఎక్కువగా ఉండడం వల్ల తెల్ల రక్తకణాలను వృద్ధి చేస్తుంది. దీంతో రోగనిరోధక కణాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు తొందరగా మానిపోతాయి.
  • వీటిలోని విటమిన్‌-ఎ, ల్యూటిన్‌, జెక్సాన్‌థిన్‌లు కంటిచూపును పరిరక్షిస్తాయి. విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసి కంటిలోని కణాలను ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి.
  •  పోషకవిలువల గాఢత ఎక్కువ. ఇందులోని తక్కువ క్యాలరీల వల్ల బరువు తగ్గుతారు.
  • గుమ్మడికాయలోని యాంటి ఆక్సిడెంట్లు ఉదరం, గొంతు, పాంక్రియాస్‌, రొమ్ము కేన్సర్ల రిస్కు నుంచి కాపాడతాయి.
  •  పొటాషియం, విటమిన్‌-సి, పీచుపదార్థాలు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
  •  గుమ్మడికాయలోని బెటా కెరొటినా సూర్యకిరణాల ప్రభావం చర్మంపై పడకుండా నేచురల్‌ సన్‌బ్లాక్‌గా పనిచేస్తుంది.
  • ఇందులోని విటమిన్‌-సి, విటమిన్‌-ఇలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • గుమ్మడికాయ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి.
  • మధుమేహాన్ని గుమ్మడి నియంత్రిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ని కట్టడి చేస్తుంది.
  • చర్మ సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. దాంతో యంగ్‌గా కనిపిస్తారు.
  • కాలేయాన్ని శుభ్రంచేస్తుంది. దీన్ని కొద్దిగా తింటే చాలు కడుపునిండుగా ఉండి ఆకలి ఉండదు.


Thursday, 8 June 2017

Onions

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే వండే ప్రతీ కూరలో ఉల్లి తప్పనిసరి చేశారు మన పూర్వీకులు. తాజాగా, ఎర్రని ఉల్లిగడ్డను తింటే కేన్సర్‌ను దీటుగా ఎదుర్కొనవచ్చంటున్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ గుల్ఫ్‌ శాస్త్రవేత్తలు. ఈ పరిశోధకుల బృందంలో భారతీయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఉల్లిగడ్డలో ఉండే ‘క్వెర్సెటిన్‌’ కేన్సర్‌ కణాలకు ప్రతికూల వాతావరణం కల్పించి కణాల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుందని, తద్వారా కేన్సర్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని వివరించారు. కేన్సర్‌ కణాలను అచేతనంగా కూడా మార్చుతుందని వెల్లడించారు.

 ఉల్లిపాయలో ఉండే క్విర్‌సిటైన్‌(quercetin ) అనే ఫ్లేవనాయిడ్స్‌ పలు వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. ఇప్పుడు ఈ గుణాలు ప్రా‍ణాంతకమైన కేన్సర్‌తో పోరాడతాయన్న విషయం కెనడా పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఎర్ర ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్‌తో పాటు ఆంథోసియానిన్‌ (anthocyanin )ను కలిగి ఉంటాయంటున్నారు. వీరు ఐదురకాల ఉల్లిపాయలను పరిశీలించారు. వీటిల్లో ఎర్ర ఉల్లిపాయలోనే ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఇవి కేన్సర్‌ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని చెబుతున్నారు. ఎర్ర ఉల్లిపాయ కేన్సర్ కణాలను ఎదుర్కొంటుందే తప్ప రాకుండా అడ్డుకోలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎర్ర ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కేన్సర్‌ రాకుండా అడ్డుకోవచ్చా అన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేదు, ఉల్లిపాయలలో ఎర్ర ఉల్లిపాయను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిదని వీరు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయను దగ్గర పెట్టుకోమని మన ఇంట్లో పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటారు. అంతేకాదు చర్మ, కేశ సౌందర్యానికి అండగా నిలుస్తుంది ఉల్లి. అలాంటి ఉల్లి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.

  • శ్వాసకోశ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
  • ఎముకలను బలోపేతం చేస్తుంది.
  • క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది.
  • మెదడును పరిరక్షిస్తుంది.
  • జీర్ణక్రియ సరిగా జరిగేలా చూస్తుంది.
  • రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది.
  • యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.
  • యాంటిబయోటిక్‌ కూడా పనిచేస్తుంది.
  • బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
  • చర్మానికి ఎంతో మంచిది.
  • జలుబు, ఫ్లూ జ్వరాలపై బాగా పనిచేస్తుంది.
  • శిరోజాలు పెరిగేందుకు ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది.
  • గాస్ట్రోఇంటస్టైనల్‌ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.
  • ఎలర్జీలను నివారిస్తుంది.
  • మూత్ర సంబంధమైన సమస్యలను తగ్గిస్తుంది.
  • కలరా తగ్గించడంలో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది.
  • విటమిన్‌-సి, విటమిన్‌-బి6, విటమిన్‌- బి1, విటమిన్‌-బి9లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కాపర్‌, మాంగనీసు, పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం ఖనిజాలు ఉన్నాయి.
  • నిద్రలేమిని తగ్గిస్తుంది.
  • గుండెకు మేలు చేస్తుంది.
  • పీచు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు పుష్కలం ఉల్లిలో.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • తేనెటీగ కుట్టినపుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
  • రక్తహీనతతో బాధపడేవారు ఉల్లిని తింటే మంచిది.
  • గొంతునొప్పి, దగ్గుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
  • చర్మంపై కురుపులను, తలలో చుండ్రును తగ్గిస్తుంది.


Friday, 2 June 2017

ఖర్జుర పండు

ఖర్జూరాల్లో సల్ఫర్‌ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలు, సైనస్‌లతో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఖర్జూరాల్లో చక్కెరలు, ప్రోటీన్లు, విటమిన్లు, సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండే వారికి పుష్టినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గ పనిచేసేలా చేస్తుంది. అందుకు వయసు రీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
 
గుండె బలహీనంగా ఉండే వాళ్లు రాత్రి పూట ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్టు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హుద్రోగాలను రాకుండా చేస్తాయి. ఖర్జూరాలు లైంగిక శక్తికి దోహదం చేస్తాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి, జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు. దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడే వాళ్లు ఖర్జూర పండ్లు తింటే వాటిల్లోని పొటాషియం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
 
దంతాల మీద ఎనామిల్‌ను సంరక్షించడంలో ఖర్జూరాలను మించింది లేదు. నిజానికి ఎనామిల్‌ ఎముక కన్నా దృఢమైన హైడ్రాక్సీ ఎపటైట్స్‌ అనే పదార్థాలతో రూపొందుతుంది. ఆహారంలో ఉండే బాక్టీరియా కారణంగా ఎనామిల్‌ క్రమంగా తగ్గిపోతుంది. అదే ఖర్జూరాల్ని రోజూ తినడం వల్ల అందులోని ఫ్లోరిన్‌ దంతాల మీద పాచి చేరకుండా చూడటంతో పాటు ఎనామిల్‌తో చర్య పొంది హైడ్రాక్సీఫ్లోరో ఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
 
పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూర పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట, కాలేయ, మూత్ర నాళ, క్లోమ, అండాశయ, క్యాన్సర్లు రావని, వచ్చినా వాటిని నివారించే శక్తి ఈ పండ్లకు ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి మూడు సార్లు ఖర్జూరాలు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఎడారి ఫలాల్లో సెలీనియం, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియం, వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరాల్లోని నికోటిన్‌ పేగుకు సంబంధిం చిన వ్యాధులను రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బాక్టీరియా పెరిగేలా చేయడానికి ఖర్జూరాల్లోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి. ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనత, అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి.
 
గర్భిణీలకు ఎంతో మేలు
రోజుకో ఖర్జూరపండు తింటే కళ్లకు మంచిది. ఇందులో ఉండే ఏ విటమిన్‌ రేచీకటిని నివారిస్తుంది. గర్భిణిలకు ఎడారి ఫలాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచిం చేలా చేయడంతో పాటు బిడ్డ పుట్టాక పాలు పడేందుకు కారణమవుతాయి. గర్భస్త శిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్‌ పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, పోట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.