తాటి ముంజలు శరీరంలో చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి.
ఐరన్, క్యాల్షియం వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సిలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్‌లు కూడా అధికంగా ఉంటాయి.
చికిన్‌పాక్స్‌తో బాధపడే వాళ్లు ముంజలు తింటే శరీరం వేడి తగ్గడంతో పాటు దురద బాధ కూడా తగ్గుతుంది.
వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఈ పళ్లల్లో నీళ్లు బాగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.
తాటిముంజలు వికారాన్ని తగ్గిస్తాయి.
వేసవిలో నిత్యం ముంజలు తింటే మంచిది. ఇవి వడదెబ్బ తగలనీయకుండా కాపాడతాయి. శరీరానికి కావాల్సినంత నీటిని అందిస్తాయి.
జీర్ణక్రియ బాగా జరగడానికి గర్భిణీలు వీటిని ఎక్కువగా తింటారు. తాటిముంజలు తినడం వల్ల గర్భిణీలలో తలెత్తే మలబద్దకం, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
వేసవిలో చెమట ద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గడం వల్ల తొందరగా అలసిపోతాం. దీన్ని అధిగమించడానికి తాటిముంజలు బాగా పనికివస్తాయి.
తాటిముంజల్లో కాలరీలు తక్కువ. కానీ అవి తినడం వల్ల అందే ఎనర్జీ ఎంతో అధికం.
వేడి గాలుల వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతను తాటిముంజలు చల్లబరుస్తాయి.
రొమ్ము కాన్సర్ నివారణకు శక్తివంతంగా పనిచేస్తాయి.
శరీరంలో గ్లూకోజ్ ప్రమాణాలను పెంచుతాయి. మినరల్స్, ప్రొటీన్ల సమతుల్యతను కాపాడతాయి.
రోగనిరోధకశక్తిని పెంచుతాయి. జీవక్రియ సరిగా జరగడంలో సహకరిస్తాయి.
తాటిముంజల్లో అధికశాతం పొటాషియం ఉండడం వల్ల కాలేయ సమస్యలు తగ్గుతాయి.
వీటిల్లో ఫైటోకెమికల్స్ బాగా ఉంటాయి. అలాగే యాంటాక్సిడెంట్లు, యాంటి- ఇన్ఫమ్లేటరీ సుగుణాలు కూడా ఉన్నాయి.
గుండెకు మేలు చేస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి. ధమనుల్లో క్లాటింగ్‌ను నివారిస్తాయి.
మహిళల్లో వైట్ డిశ్చార్జ్ (తెల్లబట్ట) ఎక్కువ అవకుండా నివారిస్తాయి.
- ముంజల్లో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. దాంతో వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు పెరుగుతామనే ఆందోళన అవసరం లేదు.
- వీటిలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి మినరల్స్ మోతాదు ఎక్కువ. కాబట్టి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందుతుంది. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు ఎదురవవు.
- ముంజలు తినడం వల్ల వాంతి, వికారం వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.
- గర్భం దాల్చిన మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో అజీర్తి, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటివి సాధారణం. ముంజలు తింటే ఈ సమస్యల నుంచి తొందరగా
- ఉపశమనం లభిస్తుంది.
- ముంజలను తింటే శరీరానికి తగినంత నీరు అందుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా వడదెబ్బకు గురయ్యే అవకాశమూ తక్కువ. అంతేకాదు వేడికి ఏర్పడే సెగగడ్డలు కూడా తగ్గిపోతాయి.
- అమ్మవారు సోకినప్పుడు ముంజలు తింటే తొందరగా తగ్గిపోతుంది.
- ముంజల్లో ఉండే ఆంథోసయనిన్ అనే రసాయనం రొమ్ము భాగంలో కేన్సర్ కణాల వృద్ధిని అరికడుతుంది. వీటిలోని పొటాషియం విషపదార్థాలను బయటకు పంపించి, కాలేయాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది.
- వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. అంతేకాదు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి.
- విటమిన్ కె, బయోటిన్ వంటి విటమిన్లు, ఫోలేట్, పీచు లభిస్తాయి. వీటిలో కొవ్వు అస్సలుండదు. డైట్ పాటించేవారికి ఇవి మంచి ఫుడ్.
- ముంజల్లో క్యాలరీలు తక్కువ. గ్లూకోజ్ ఎక్కువ ఉండడంతో శరీరానికి తొందరగా శక్తి అందుతుంది.
- వంద గ్రాముల ముంజల్లో 43 క్యాలరీలు, 11 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 27 శాతం కాల్షియం, పీచుపదార్థం, ఐరన్, ఎ, ఇ విటమిన్లు లభిస్తాయి.
- ముంజలకు కొబ్బరి నీళ్లు కలిపి, ఫ్రిజ్‌లో ఉంచితే వీటి చల్లదనం మరింత పెరుగుతుంది. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తింటే తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- యాలకులు లేదా దాల్చినచెక్క పొడిని ముంజల మీద చల్లుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. వీటితో నోరూరించే ఖీర్ తయారుచేసుకోవచ్చు.
No comments:
Post a Comment