Thursday 11 May 2017

Saffron

కమ్మదనం కోసమో, కమ్మటి వాసన కోసమో కుంకుమ పువ్వును కొన్ని రకాల వంటకాల్లో వాడుతుంటారు. అయితే ఇందులో ఎన్నో ఔషధ విలువలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా......
కుంకుమ పువ్వులో శరీరంలో తిరుగాడే హానికారక ఫ్రీ- ర్యాడికల్స్‌ను దెబ్బతీసే యాంటీ- ఆక్సిడెంట్లు, శరీరంలో వాపు ఏర్పడకుండా నివారించే యాంటీ - ఇన్‌ఫ్లమేటరీ అంశాలు, డిప్రెషన్‌ కారకమైన, మూర్చకారకమైన పరిణామాలను నిలువరించే ఔషధాంశాలు, క్యాన్సర్‌ కార కాలను అంతమొందించే అంశాలతో పాటు జ్ఞాపకశక్తిని పెంచేవి కూడా కుంకుమపువ్వులో పుష్కలంగా ఉన్నాయి.
కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గించేవి, కడుపు పట్టేయడం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి.
నిద్రలేమి లేదా నిద్రాపరమైన ఇతర సమస్యల కారణంగా, నేత్రకణజాలం దెబ్బతినకుండా నివారించడం కుంకుమ వల్ల అవుతుంది. ముఖ్యంగా, మాక్యులర్‌ డీ-జనరేషన్‌, రెటీనల్‌ పిగ్మెంటేషన్‌ వంటి సమస్యల కారణంగా వచ్చే అంధత్వాన్ని తొలగించడం లేదా ఆంధత్వ వేగాన్ని తగ్గించడం కుంకుమ పువ్వుతో సాధ్యమవుతుంది.
గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు, రక్తంలోని కొలెస్ట్రాల్‌ నిలువల్ని కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.
ఆస్తమాను నియంత్రించడంతో పాటు కుంకుమ పువ్వు శ్వాసను సులభతరం చేస్తుంది.
కుంకుమ పువ్వు కషాయంలో కాస్తంత తేనె మిళితం చేసి తాగితే అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు మాయమవుతాయి.
నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో కాసింత కుంకుమ పువ్వు వేసుకుని ఒక స్పూను తేనె కలుపుకుని తాగినా అజీర్తి, కడుపు ఉబ్బరం మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి.


కుంకుమ పువ్వు ఎంతో ఖరీదైందే.... కానీ దానివల్ల ఆరోగ్యపరమైన లాభాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...
కుంకుమపువ్వులో మాంగనీసు, ఐరన్‌, సెలేనియం, కాపర్‌, పొటాషియం, కాల్షియం, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు మరెన్నో బలవర్థకమైన విటమిన్లు కూడా ఉన్నాయి.
ఇది బ్రెయిన్‌లోని సెరటోనిన్‌ను ఆరోగ్యకర పరిమాణంలో ఉంచుతుంది.
ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది.
నిత్యం కుంకుమపువ్వును వాడేవాళ్లు కేన్సర్‌ బారిన పడరని స్టడీలో వెల్లడైంది.
కుంకుమపువ్వు వాడకం వల్ల శరీరంలో సెరొటోనిన్‌ ప్రమాణాలు పెరుగుతాయి.
సెరొటోనిన్‌కి ఆకలిని తగ్గించే గుణం ఉండడంతో ఊబకాయం తగ్గుతుంది.
కుంకుమపువ్వులో పొటాషియం ఉంది. అది రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా గుండెజబ్బులు తలెత్తవు.
డిప్రషన్‌తో బాధపడేవారికి కుంకుమపువ్వు మందులా పనిచేస్తుంది. డిప్రషన్‌ తలెత్తడానికి కారణం శరీరంలో తక్కువ పరిమాణంలో పొటాషియం ఉండడమే. కుంకుమపువ్వులో పొటాషియం పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి డిప్రషన్‌ తగ్గుతుంది.
కుంకుమపువ్వు మంచిది కదా అని ఎక్కువ పాళ్లల్లో వాడితే అది విషంగా మారుతుంది.


No comments:

Post a Comment