నేల గుమ్మడి చూర్ణాన్ని, దాని రసంలో 7 రోజుల పాటు ఉంచి, ఆ తర్వాత ఎండించాలి.
చూర్ణాన్ని రెండు స్పూన్ల మోతాదులో చక్కెర కలిపిన అరకప్పు పాలతో తీసుకుంటే, పసిపిల్ల తల్లులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది.
పచ్చి దుంప రసంలో చక్కెర కలిపి తాగితే అల్సర్ బాధలు తగ్గుతాయి.
దుంప ముక్కలను నీటిలో ఉడికించి, స్నానం చేస్తూ ఉంటే, ఒంటి నొప్పులు తగ్గుతాయి.
పటిక పంచదార కలిపిన పాలలో 10 గ్రాముల మోతాదులో నేల గుమ్మడి చూర్ణాన్ని కలిపి సేవిస్తూ ఉంటే, శీఘ్రస్కలన సమస్య పోతుంది. మూత్రంలో మంట రావడం కూడా తగ్గిపోతుంది. శరీరానికి చలువ చేస్తుంది. క్రమం తప్పకుండా వాడుతుంటే, శుష్కించిన దేహం, బలంగా తయారవుతుంది. దేహ పుష్టి, వీర్యవృద్ధితో పాటు రక్తశుద్ధి కూడా కలుగుతుంది. అంతిమంగా ఇది ఆయువృద్ధికి బాట వేస్తుంది.
200 మి.లీ. ఆవు పాలలో 800 మి.లీ. నీటిలో 50 గ్రాముల నేలగుమ్మడి చూర్ణం కలపాలి. ఆ తరవాత పాలు మాత్రమే మిగిలేదాకా మరిగించాలి. అందులో తగినంత పటిక పంచదార కలిపి రోజూ తాగుతూ ఉంటే, స్త్రీల రుతుచక్రం క్రమబద్దమవుతుంది. ఈ సేవనం వల్ల శరీర ఉష్ణోగ్రత్త తగ్గడంతో శరీర సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది.
No comments:
Post a Comment