Tuesday 20 March 2018

Cashew Nuts

జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా!
శీతాకాలంలో బెస్ట్‌!
నిజానికి మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్‌ జీడిపప్పులో ఉంటుంది. కిడ్నీ ఆకృతిలో కనపడటమే కాదు దీనివల్ల కి డ్నీలకు కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. సహజంగా వీటిలో ఉష్ణగుణం ఉంటుంది. అందుకే వీటిని శీతల కాలంలో తినడానికే ప్రాధాన్యమివ్వాలి. వీటిని ఒక పరిమితిలో తీసుకోవడమే మేలు! ఎందుకంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ముక్కునుంచి రక్తస్రావం కావడం గానీ, విరేచనాలు కావడం గానీ జరగవచ్చు. తరచూ విరేచనాల సమస్యకు గురయ్యేవారు వీటిని అసలు తినకపోవడమే శ్రేయస్కరం.
 
ఇలా తీసుకుంటే...
జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత హరిస్తుంది. జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, జీవశక్తిని బలోపేతం చేస్తుంది. శారీరక బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది. గుండెకూ, కిడ్నీలకూ ఇది చక్కని టానిక్‌లా పనిచేస్తుంది.
 
జీడినూనెలో...
జీడి నూనెలో శరీరానికి మేలు చేసే కార్డోల్‌, అనాకార్డిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను క్రమం తప్పకుండా లేపనంగా రాస్తే అన్ని రకాల పులిపిర్లు రాలిపోతాయి.
మరికొన్ని ప్రయోజనాలు:
  • ఇనుము సమృద్ధిగా ఉండే జీడిపప్పు రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్లు రోజూ తగినంత జీడిపప్పు తింటూ ఉండాలి. జీడిపప్పులో కడుపు ఉబ్బరం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే, పరిమితంగా తీసుకుంటే ఆ సమస్య లేకపోగా, ఆకలి పెరిగి, జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.
  • లైంగిక బలహీనత ఉన్న వారికి ఇది గొప్ప టానిక్‌గా పనిచేస్తుంది. ఇది వీర్య కణాలను పెంచడంతో పాటు చిక్కబరుస్తుంది. జీడిపప్పును రోజూ తింటే నపుంసకత్వం కూడా తొలగిపోతుంది.
  • ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకూ, బుద్ధి జీవులకూ వారి మేధాఇశక్తిని పెంచే గొప్ప టానిక్‌గా పనిచేస్తుంది.
  • మాంసంలో జీవక్రియలను దెబ్బ తీసే యూరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అయితే దానికి విరుగుడుగా జీడిపప్పు తింటే యూరిక్‌ యాసిడ్‌ తయారవడం ఆగిపోతుంది. అప్పటికే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు ఉంటే అవి తగ్గిపోతాయి.
  • వయసు పైబడుతున్న కొద్దీ వివిధ పరిణామాలు శరీరం మీద కనిపిస్తుంటాయి. ఆ పరిణామాల వేగాన్ని నియంత్రించడంలో రెబోఫ్లేబిన్‌ సమర్థంగా పనిచేస్తుంది. అయితే, జీడిపప్పులో ఉండే రెబోఫ్లేవిన్‌కి వార్ధక్య లక్షణాలను అడ్డుకొనే శక్తితో పాటు శరీరానికి పునరుజ్జీవం కలిగించే శక్తి అపారంగా ఉంది.
  • బొల్లివ్యాధిని తగ్గించడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు రోజూ తగినంత జీడిపప్పు తింటూ, జీడినూనెను ఆ మచ్చల మీద రాస్తే మచ్చలు పోయి చర్మం సహజ వర్ణాన్ని సంతరించుకుంటుంది. బొల్లితో పాటు, కార్న్స్‌, రింగ్‌వామ్‌, షింగిల్స్‌, ఎగ్జిమా, పులిపిర్ల వంటి అనేక చర్మ సమస్యలను ఇది త గ్గిస్తుంది.
  • రోజూ తగినంత జీడిపప్పును ఎండుద్రాక్షతో తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు.
  • రోజూ తగినంత జీడిపప్పు తింటే, అధిక రక్తపోటు సమస్య అదుపులోకి రావడంతో పాటు రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.

No comments:

Post a Comment