నిండు ఆరోగ్యానికి రోజూ రెండు చుక్కల తేనె తాగితే చాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒక్కో రకమైన తేనె ఒక్కో విధమైన రుచినిస్తుంది. రంగురంగుల రకరకాల తేనెలు ఉత్పత్తవుతున్నాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు, ఇలా భిన్న రంగులతో పాటు, వర్ణరహితమైన తేనెలు ఉన్నాయి. యూకలిఫ్టస్, నిమ్మ జాతి పూల తేనె ఘాటైన రుచిని, వాసనని కలిగి ఉంటుంది. బేకింగ్ ఉత్పత్తుల్లో చక్కెర బదులు తేనె వాడడంతో అవి రుచికరంగాను, సువాసన భరితంగాను ఉంటాయి. శుద్ధి చేయని ముడి, జాంటి తేనెలో విటమిన్‌లు, ఎంజైమ్‌లు, యాంటి ఆక్సిడెంట్లు, పుష్కలంగా ఉంటాయని, అందుకే శక్తి కోసం తేనెను నేరుగా తినవచ్చు. గోరువెచ్చని నీళ్లలో కలిపి సేవిస్తే మరీ మంచిది.
ఆయుర్వేదంలో
ప్రపంచ ఈజిప్షియన్లు, భారతీయులు ప్రాచీన కాలం నుంచి వైద్యంలో తేనెను వాడుతున్నారు. ఆయుర్వేదానికి తేనె ప్రాణం వంటిది. శభ్రత సంహిత తేనెను తాగే మందుగా, దివ్య ఔషధంగా అభివర్ణించారు. శ్వాసకోశ వ్యాధులకు దీన్ని మించిన ఔషధం లేదు. గాయాల నివారణతో పాటు, పొట్టకు సంబంధించిన వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
చర్మ సౌందర్యానికి తేనె కీలకంగా పనిచేస్తుంది. ముఖానికి తేనెతో కూడిన ప్యాక్ వేసుకోవడంతో చర్మం పునరుజ్జీవం పొందుకుంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఎండిపోయినట్లున్న చర్మం చక్కని నిగారింపును సంతరించుకుంటుంది. పెదాలను కూడా పగలనివ్వదు. పొడిబారిన జుట్టు కూడా మృదువుగా మారుతుంది. అన్ని సుగుణాలున్నాయి కాబట్టే భావకవులు మంచి మనసుల్ని తేనె మనసులని, మంచి మాటలను తేనే పలుకులని అభివర్ణిస్తారు.
తేనె ఉత్పత్తిలో వాడే పూల మీద ఆధారపడి దాని నాణ్యత, ఔషధగుణాలు ఉంటాయి. కేవలం ఒకే రకమైన పూల కన్నా రకరకాల పూల నుంచి సేకరించిన తేనెలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనె ఎప్పటికీ పాడవదు. అది నిజమే అయినప్పటికీ మార్కెట్లో లభించే తేనెలన్నీ కొంత కాలానికి ముదురు రం గుల్లోకి మారుతుంటాయి. అంటే వాటిలో సహజంగా ఉండే కొన్ని గుణాలు దెబ్బతిన్నాయని అర్థం. తేనెలో నీటి శాతం 19 శాతం కన్నా ఎక్కువగా ఉంటే త్వరగా పులుస్తుంది. రిఫ్రోక్ట్ మీటర్ ద్వారా తేనెలో నీటి శాతాన్ని కొలవవచ్చు. లేదంటే తేనెను పైకి తీస్తే వేగంగా కిందకి కారుతున్నా, జారుతున్నా అందులో నీటి శాతం ఎక్కువగా ఉందని గుర్తించాలి. ప్రొసెసింగ్‌లో భాగంగా ఎక్కువగా వేడి చేయడం వల్ల గడ్డకట్టే గుణం తగ్గిపోయినా అలా కారుతుంది. అధిక ప్రొసెసింగ్ వలన సహజంగా ఉండే బాక్టీరియా, విటమిన్లు, ఎంజైమ్‌లు హరించుకుపోతాయి. అం దుకే ముడి తేనె వాడడమే మేలు, తేనె నాణ్యత సీజన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. పూలు ఎక్కువగా పూచే వేసవిలో తయారయ్యే తేనె మంచి వాసనతో చిక్కగా ఉంటుంది. వడపోసిన తేనె వాడడం మంచిది కాదు. తేనెలో ఉండే పుప్పొడి వల్లే దానికి ఔషధ గుణాలు ఉంటాయి. ఆ పుప్పొడి లేని తేనె పంచదార లేని పాకం వంటిదే.
పోషకాహార లేమితో భాదపడే వారికి తేనె మంచి ఆహారం. తేనెలో విటమిన్-సి, ప్రోటీన్లు, ఆమైనో ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సోడియం, వంటి ఖనిజాలు లభిస్తాయి. ఇందులో ఫ్రక్పోజ్ 38శాతం, గ్లూకోజ్-31శాతం, సుక్రోజ్-1 శాతం, నీరు 17 శాతం, ఇతరత్రా చక్కరలు 9శాతం ఉంటాయి. కేవలం చక్కెరలకే అంత చిక్కదనం ఎలా అని ఆరా తీస్తే కూలీ ఈగలు మకరందాన్ని తీసుకువచ్చేటప్పుడు వాటిల్లోని కొన్ని ఎంజైమ్‌లు అందులో కలుస్తాయి. ఆ తరువాత ఈగలన్నీ తేనెపట్టులోకి చేరి అక్కడ రెక్కలు అల్లారుస్తూ ఎగరడం వలన మకరందంలోని తీరు ఆవిరై గాఢత పెరిగి తేనెలా మారుతుంది. అందుకే పంచదారతో పోలీస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. అమెరికన్ డ్రగ్, ఆడ్మినిస్ట్రేషన్ లెక్క ప్రకారం ఒక్క టేబుల్ స్పూను పంచదారలో 15 క్యాలరీలు ఉంటే తేనెలో 64 కేలరీలు ఉంటాయి. తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్‌గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే అథ్లెట్లకు తేనె తక్షణ శక్తిగా పనిచేస్తుంది.
- తేనెను నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
- తేనెలో అధికంగా ఉండే విటమిన్-సి, మోఫినోలిక్‌లు, ఫ్లెవనాయిడ్‌లు, పాలీ ఫిలానిక్‌లు, యాంటి ఆక్రిడెంట్లుగా పనిచేయడమే ఇందుకు కారణం.
- తేనెను నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.
- గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడం వలన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది.
- ముడి తేనె ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది.
- రక్తంలో చక్కెర నిల్లలు తగ్గకుండా చూస్తుంది.
- వ్యాయామం తరువాత దీన్ని తీసుకోవడం వలన అలసట మాయమవుతుంది.
- యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది.
- పుండ్లను, గాయాల్ని మాన్చడంలో తేనె ప్రభావశీలిగా పనిచేస్తుంది.
- మచ్చల్ని మాయం చేయడంలో దీన్ని మించింది లేదు.
- స్థానికంగా దొరికే తేనె తాగడం వలన అలర్జీలు త్వరగా దరిచేరవు.
Honey is a natural food produced by bees
from nectar or secretion of flowers. In
Ayurveda, honey is widely used in
therapeutics as an important vehicle
(Anupana) for drug administration through
the oral route and also in the preparation of
various medicaments, like confection, selfgenerated alcoholic preparation, medicated
enema preparation as well as externally for
burn wound healing etc. n.
Attempt were made to compare physico-
chemical analysis of different samples of honey
using API standard. Honey collected from
natural habitat and was compared with
different market samples, using parameters
like Specific Gravity, Fructose/Glucose ratio,
artificial invert sugar (which helps to detect
the presence of added sugar and jaggery or
any other natural and artificial sweetening
agents in Honey) etc.

No comments:
Post a Comment