రోజువారీ ఆహారంలో వేరుశనగకు చోటిస్తే హృద్రోగాలు దరిచేరవని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇటీవలి అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పా రు. ఇందులో భాగంగా.. 15 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులను ఎంచుకుని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు రోజూ ఆహారంతో పాటు వేరుశనగతో తయారు చేసిన పానీయాన్ని అందించారు. మరో గ్రూపునకు ఇతర పదర్థాలతో తయారుచేసిన పానీయాన్ని ఇచ్చారు. ఆపై అరగంట తర్వాత వలంటీర్లకు రక్తపరీక్ష నిర్వహించగా.. వేరుశనగ పానీయాన్ని తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్ స్థాయులు తగ్గాయని వర్సిటీ శాస్త్రవేత్త పెన్నీ క్రిస్ ఎథర్టాన్ తెలిపారు.
No comments:
Post a Comment