Tuesday 11 April 2017

Tarbooja

వేసవి తాపాన్ని తీర్చే పళ్లలో చెప్పుకోదగినది తర్బూజా. నీటి శాతం ఎక్కువగా ఉండే తర్బూజా ముక్కలు తింటే పొట్టలో చల్లగా ఉండటంతోపాటు చలువ కూడా చేస్తుంది. ఇక తర్బూజా పండుతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే! 
ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును క్రమపరిచి హైపర్‌టెన్షన్‌ని దూరంగా ఉంచుతుంది.
తర్బూజాలో ఉండే విటమిన్‌ ఎ, బీటా కెరొటిన్‌ దృష్టిని మెరుగుపరిచి శుక్లాలు రాకుండా కాపాడుతుంది.
తర్బూజాలోని చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకోగలదు. తర్బూజా విత్తనాల్లో ఉండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.
ఈ పండు తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
దీన్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెంచి వ్యాధికారక బ్యాక్టీరియా, వైర్‌సల నుంచి రక్షణ కల్పిస్తుంది.
తర్బూజా తింటే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
‘ఆక్సికైన్‌’ అనే పదార్థం వల్ల మూత్రపిండాల వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
తర్బూజా తింటే కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది.
దీనికుండే ‘యాంటి కోయాగులెంట్‌’(రక్తపు గడ్డలు కరిగించే స్వభావం) వల్ల నెలసరి నొప్పులు తగ్గుతాయి.

No comments:

Post a Comment