Wednesday 26 April 2017

Sorakaya

శరీరంలోని జీవక్రియలన్నీ సవ్యంగా పనిచేసినప్పుడే లైంగిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సొరకాయలో జీవ కియ్రల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది పురుషుల పాలిట వరమయ్యింది. దీనివల్ల వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరగడంతో పాటు మరోన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఎంతో మేలు కలుగుతుంది.
 
హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.

Monday 17 April 2017

Keera dosakaya






కీర దోసలో విటమిన్‌ కె, మాలిబ్డినమ్‌ పుష్కలంగా ఉంటాయి. ‘పాంటోథెనిక్‌ యాసిడ్‌’ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వేసవిలో శరీరం కోల్పోయే పోషకాలను భర్తీ చేసేవే! 
 కీరదోసలోని కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, విటమిన్‌ సి, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, బయోటిన్‌, విటమిన్‌ బి1లు కూడా చెమట ద్వారా నశించే ఖనిజ లవణాలను అందిస్తాయి. 
 సిలికా అనే ఖనిజ లవణం గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బి విటమిన్లు ఆందోళనను తగ్గించి ఒత్తిడి నుంచి రక్షణ కల్పిస్తాయి. దాహం వేసినప్పుడు నీరు అందుబాటులో లేకపోతే కీరా దోసను తిని దాహం తీర్చుకోవచ్చు. 
 పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే ఎండకు కళ్లు మంట పెడుతుంటే కీరాను చక్రాల్లా తరిగి మూసిన కనురెప్పలపై పది నిమిషాలపాటు ఉంచుకోవాలి. ఇక కీరాను నేరుగా తినలేనివాళ్లు ముక్కలుగా తరిగి టొమాటో, ఉల్లి ముక్కలు కూడా చేర్చి, ఉప్పు, కారం కలిపి సలాడ్‌గా కూడా తినొచ్చు.




  • కీరదోసలో తొంభై శాతంపైగా నీరు ఉంటుంది. వేడి వల్ల శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ర్టోలైట్స్‌ను కీరదోస భర్తీచేస్తుంది. కీరదోస తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది.
  • ఎండ ప్రభావం వల్ల చర్మం కందిపోతుంది. కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. టాన్‌ సమస్య నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
  • కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో ఒంట్లోని మలినాలు, విషపదార్థాలు బయటకు పోతాయి. యూరిక్‌ ఆమ్లం నిల్వలు తగ్గిపోతాయి. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరిగిపోతాయి.
  • దీనిలో ఎ, బి, సి విటమిన్లు లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. కీరదోస రసాన్ని బచ్చలి, క్యారెట్‌ రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. తరచుగా కీర తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
  • కీరలో లభించే విటమిన్‌ ఇ చర్మం ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
  • కీరదోస ముక్కలు ఉంచిన నీళ్లను రోజు తాగితే శరీర పీహెచ్‌ ఒకేవిధంగా ఉంటుంది.
  • చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడే మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్‌ వంటి మినరల్స్‌ కీరదోసలో ఉంటాయి. చల్లచల్లని కీర ముక్కలను కళ్ల మీద కొద్దిసేపు ఉంచితే కళ్ల కింద ఏర్పడే వలయాలు తగ్గిపోతాయి. కళ్ల అలసట కూడా పోతుంది.
  • వీటిని సలాడ్స్‌ లేదా సూప్‌ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి నీటితో పాటు పీచుపదార్థం కూడా అధికంగా అందుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. అహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.
  • కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసంలో లభించే సిలికా మూలకం కేశాలను, గోళ్లను దృఢంగా మార్చి, వాటిని మెరిసేలా చేస్తుంది.
  • కీరదోసను తరచుగా తినడం ద్వారా అధిక రక్తపీడనం, అల్ప రక్తపీడనం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీనిలోని స్టెరాయిడ్స్‌ చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తాయి. దాంతో గుండె సంబంధమైన జబ్బుల నుంచి కాపాడుతుంది.
  • వీటిని తినడం వల్ల క్లోమ గ్రంథిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి డయాబెటిక్‌ సమస్య ఉన్నవారికి కీరదోస మంచి ఫడ్‌ చాయిస్‌. కీరలోని విటమిన్లు, మినరల్స్‌ కండరాలు, కీళ్ల నొప్పులను నివారిస్తాయి.
  • దీనిలో విటమిన్‌ కె లభిస్తుంది. క్యాల్షియాన్ని ఎముకలకు అందించి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్‌ కె సాయపడుతుంది

Tuesday 11 April 2017

Tarbooja

వేసవి తాపాన్ని తీర్చే పళ్లలో చెప్పుకోదగినది తర్బూజా. నీటి శాతం ఎక్కువగా ఉండే తర్బూజా ముక్కలు తింటే పొట్టలో చల్లగా ఉండటంతోపాటు చలువ కూడా చేస్తుంది. ఇక తర్బూజా పండుతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే! 
ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటును క్రమపరిచి హైపర్‌టెన్షన్‌ని దూరంగా ఉంచుతుంది.
తర్బూజాలో ఉండే విటమిన్‌ ఎ, బీటా కెరొటిన్‌ దృష్టిని మెరుగుపరిచి శుక్లాలు రాకుండా కాపాడుతుంది.
తర్బూజాలోని చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకోగలదు. తర్బూజా విత్తనాల్లో ఉండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.
ఈ పండు తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
దీన్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెంచి వ్యాధికారక బ్యాక్టీరియా, వైర్‌సల నుంచి రక్షణ కల్పిస్తుంది.
తర్బూజా తింటే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
‘ఆక్సికైన్‌’ అనే పదార్థం వల్ల మూత్రపిండాల వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
తర్బూజా తింటే కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది.
దీనికుండే ‘యాంటి కోయాగులెంట్‌’(రక్తపు గడ్డలు కరిగించే స్వభావం) వల్ల నెలసరి నొప్పులు తగ్గుతాయి.

Saturday 1 April 2017

Groundnuts

రోజువారీ ఆహారంలో వేరుశనగకు చోటిస్తే హృద్రోగాలు దరిచేరవని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇటీవలి అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పా రు. ఇందులో భాగంగా.. 15 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులను ఎంచుకుని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు రోజూ ఆహారంతో పాటు వేరుశనగతో తయారు చేసిన పానీయాన్ని అందించారు. మరో గ్రూపునకు ఇతర పదర్థాలతో తయారుచేసిన పానీయాన్ని ఇచ్చారు. ఆపై అరగంట తర్వాత వలంటీర్లకు రక్తపరీక్ష నిర్వహించగా.. వేరుశనగ పానీయాన్ని తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్‌ స్థాయులు తగ్గాయని వర్సిటీ శాస్త్రవేత్త పెన్నీ క్రిస్‌ ఎథర్టాన్‌ తెలిపారు.