Wednesday, 25 December 2019

pudina







సుగంధ మొక్కల్లో పుదీనా ఒకటి. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుంది. ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుంది. ఉత్సాహాన్ని నింపడంతో పాటు నీరసాన్ని దూరం చేస్తుంది. పుదీనా వాసన పీల్చడంతో తలనొప్పులు తగ్గడంతో పాటు, పూడుకుపోయిన సైనస్‌ గదులు శుభ్రమవుతాయి. మైగ్రేన్‌ సమస్య తగ్గిపోయేలా చేస్తుంది. నాణ్యమైన నిద్రకు బాగా ఉపయోగపడుతుంది. భావోద్వేగాల్లో స్థిమితత్వాన్ని తెస్తుంది.

Sunday, 1 December 2019

Thati Tegalu (palmirah tree seed shoots )


























తాటిచెట్లకు కాసే ముంజుల గెలలను కోయకుండా అలాగే వదిలేస్తే పండ్లుగా మారి కిందకు రాలతాయి. వీటి నుంచి గుజ్జును తీసి తాటి అట్లు, గారెలు వేసుకుని తింటారు. గుజ్జు తీయగా మిగిలిన టెంకెలను మట్టిలో పాతుతారు. ఇలా చేయడం వల్ల బుర్రగుంజు తయారవుతుంది. బుర్రగుంజును తీయకుండా టెంకను వదిలివేయడం వల్ల తేగ తయారవుతుంది. ఆకుతో కూడిన చిన్నటి మొక్క మొలుస్తుంది. తరువాత దానిని బయటకు తీసి తేగ పైభాగంలోని తొక్కలను తీసి కాండాన్ని కుండలో ఉడకబెడతారు. మంటపై కాలుస్తారు. ఇలా తయారైన తేగను తొక్క, పొర తొలగించుకుని తింటే భలే రుచిగా ఉంటాయి


  • తాటి తేగల్లో కొవ్వు శాతం తక్కువగానూ, పీచు పదార్థం ఎక్కువగానూ ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందవచ్చు. మలబద్దకం సమస్య తొలగిపోతుంది.
  • అనేక రకాల సూక్ష్మ ధాతువులు తేగల్లో లభ్యమవుతాయి.
  • పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు సాయపడుతుంది.
  • ఫైబర్‌ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ నిల్వ ఉండదు. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.
  • బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధం.
  • మధుమేహం ఉన్నవారు తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేసి మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
  • తాటి తేగలను ముక్కలుగా చేసుకుని నమలడం వల్ల నోటి సంబంధ సమస్యలు రావు.
  • రక్తం వృద్ధి చెందుతుంది. రక్తం తక్కువగా ఉండి అనీమియాతో బాధపడుతున్న వారు రోజూ తేగలను తింటే సత్ఫలితముంటుంది.
  • చర్మ వ్యాధులు వ్యాపించవు. కాలేయ వ్యాధులు దరిచేరవు.
  • తేటి తేగలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.
  • బ్లడ్‌ కేన్సర్‌కు ఇవి చెక్‌ పెడతాయి. కేన్సర్‌ను తొలిదశలోనే నిర్మూలించే శక్తి కలిగినవి.
  • తేగలను పాలలో ఉడికించి చర్మానికి రాసుకుంటే మెరుపుదనం వస్తుంది.