కుంకుమపువ్వు చలి, జలుబుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలను జలుబు చేసినప్పుడు నుదురు మీద రాసుకుంటే, ఉపశమనం లభిస్తుంది. ఈ పువ్వులో శరీరానికి వేడిని అందించే గుణాలుంటాయి.
జ్ఞాపకశక్తి: కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే మెదుడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిలువరిస్తుంది.
మెన్‌స్ట్రువల్ క్రాంప్స్: బహిష్టు సమయంలో పొత్తి కడుపులో నొప్పి తగ్గాలంటే కుంకుమపువ్వు కలిపిన పాలు తాగాలి. దీనిలో నొప్పిని నివారించే గుణాలుంటాయి. దాంతో కొంత ఉపశమనం పొందుతారు.
నిద్రలేమి: కుంకుమ పువ్వులోని క్రొసిన్, సాఫ్రనాల్, పిక్రోక్రోసిన్ వంటి ప్రొటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పాలలో లేదా టీలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య దరిచేరదు. మానసిక ఒత్తిడిని పోగొడుతుంది. కుంకుమపువ్వులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం: రక్త ప్రసరణ సవ్యంగా జరిగేందుకు, రక్తనాళాలు కుచించుకుపోకుండా కుంకుమపువ్వు చూస్తుంది. కుంకుమపువ్వులోని లక్షణాలు రక్తంలో కొలెస్ర్టాల్‌ను తగ్గించి, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ముప్పునునివారిస్తాయి.
ఆస్తమా, అలర్జీ: గ్లాసు పాలలో కుంకుమపువ్వు కలిపుకొని తాగితే కీళ్ల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆస్తమా, ఇతర అలర్జీల సమస్యలను దూరంచేస్తాయి.